
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మంజీరా వాటర్ సప్లై స్కీమ్ఫేజ్-2 లోని పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న వాటర్‌బోర్డు1,500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు ఆర్ సీపురం, ఫాదర్ స్కూల్, ఓల్డ్ ముంబయి రోడ్డులోని మూడు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు రిపేర్లు కొనసాగాయి. దీంతో శనివారం ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట ఏరియాల్లో లో ప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతుందని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.
హాఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు వారికి, అలాగే కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం ప్రాంతాలకు మొత్తానికే సరఫరా ఉండదన్నారు.