రైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్‎తో 34 రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్‎తో 34 రైళ్లు రద్దు

హైదరాబాద్  రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దానా తుపాన్ ఎఫెక్ట్‎తో ఆంధ్రా మీదుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడిచే 34 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 22) సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2024, అక్టోబర్ 23 సాయంత్రానికి తుపాను ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీన పూరి-పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో అతి తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దానా తుపాన్ ప్రభావం రైల్వే వ్యవస్థపైన పడింది. ఇందులో భాగంగానే ఈ నెల (అక్టోబర్) 23, 24, 25 తేదీలలో ఈస్ట్​-కోస్ట్​ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రద్దైన రైళ్ల పూర్తి వివరాలు:

హౌరా-సికింద్రాబాద్, కామాఖ్య-SMVT బెంగళూరు, ఖరగ్‌పూర్-విల్లుపురం, హౌరా-భువనేశ్వర్, షాలిమార్-హైదరాబాద్, సంత్రాగచ్చి-మంగళూరు సెంట్రల్,  షాలిమార్-చెన్నై సెంట్రల్, హౌరా-తిరుచ్చిరాపల్లి, హౌరా-SMVT బెంగళూరు, షాలిమార్-వాస్కో-డ-గామా, హౌరా-చెన్నై సెంట్రల్, పాట్నా-ఎర్నాకులం, సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్, సిల్చార్-సికింద్రాబాద్, దిబ్రూఘర్- కన్నియాకుమారి, సికింద్రాబాద్-భువనేశ్వర్, పుదుచ్చేరి-హౌరా, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్-షాలిమార్, పుదుచ్చేరి భువనేశ్వర్, KSR బెంగళూరు భువనేశ్వర్, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి, SMVT బెంగళూరు-ముజఫర్‌పూర్, హైదరాబాద్-హౌరా, కన్నియాకుమారి-దిబ్రూఘర్, తాంబరం-సంత్రగచ్చి, సికింద్రాబాద్-హౌరా, SMVT బెంగళూరు-హౌరా, CST ముంబై భువనేశ్వర్, SMVT బెంగళూరు-గౌహతి, సికింద్రాబాద్-మాల్దా టౌన్, యశ్వంత్‌పూర్-హౌరా, తిరునెల్వేలి-షాలిమార్, పూరి-తిరుపతి

ALSO READ | మహారాష్ట్రలో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‎ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం