తెలంగాణకు ఇవాళ(జూలైై20), రేపు(జూలై21) రెండు రోజులు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా,ఉత్తరాంధర తీరంలోని వాయువ్య బంగాళాఖాతంంలో చిలికా సరస్సు దగ్గర వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
జూలై 20న తెలంగాణలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు.. మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. జూలై 21న కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ రోజు , రేపు రాష్ట్రంలో ఉరుములు మెరుపులుతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా , ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ జిల్లాలో అక్కడ కురిసే అవకాశం.
ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలోఅక్కడ భారీ వర్షాలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గంటకు 30 నుంచి 40 వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.