అలర్ట్ : మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం

అలర్ట్ : మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం

రంగారెడ్డి జిల్లా: ఉస్మాన్ సాగర్ (గండిపేట్) దిగువన అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. పరీవాహక ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఉస్మాన్ సాగర్ జలాశయానికి ప్రవాహం మరింత పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ మట్టం దాని సామర్థ్యం మేరకు నిండి ఉంది. మంగళవారం(ఈరోజు) ఉదయం 8 గంటలకు మొత్తం 6 గేట్లను 2 అడుగుల ఎత్తుకు ఎత్తి 1,428 క్యూసెక్కులను నీటిని మూసీ నదిలోకి వదులుతారు. రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో మూసి నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Also Read:-ఐఫోన్ కోసం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి చంపేశాడు

నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల బ్రిడ్జి పై నుంచి నీరు పొర్లే అవకాశం ఉందని అధికారులు భావించారు. నార్సింగి పోలీసులు మంచిరేవుల బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం జరుగుతుందని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.