దట్టమైన పొగమంచు విమాన సేవలకు కాదు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ట్రాఫిక్‌కు సవాళ్లను సృష్టిస్తోంది. విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి వరకు ఉత్తర భారతదేశంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసింది.
ALSO READ | Naval Ships: సముద్ర రక్షణలో గ్లోబల్ లీడర్.. సైన్యంలోకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు
ప్రమాదాలను నివారించడానికి, పొగమంచు సమయంలో ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రాబోయే వారాల్లో ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు కలిగిన అసౌకర్యాన్ని ముందుగానే తెలుసుకునేందుకు రద్దు చేయబడిన రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలు..
రద్దు చేయబడిన రైళ్ల జాబితా
- రైలు నెం.14617-18: బన్మంఖి- అమృతసర్ జనసేవ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి మార్చి 2, 2025 వరకు).
- రైలు నెం.14606-05: యోగనగరి రిషికేశ్- జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు).
- రైలు నెం.14616-15: అమృత్‌సర్- లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి మార్చి 22, 2025 వరకు).
- రైలు నెం.14524-23: అంబాలా- బరౌని హరిహర్ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి ఫిబ్రవరి 27, 2025 వరకు).
- రైలు నెం.18103-04: జలియన్‌వాలా బాగ్ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు).
- రైలు నెం.12210-09: కత్గోడం- కాన్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు).
- రైలు నెం.14003-04: మాల్దా టౌన్- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (జనవరి 13 నుండి మార్చి 1, 2025 వరకు).