GPay, Paytm, PhonePe యూజర్లకు అలర్ట్.. మారుతున్న కీలక రూల్ ఏంటంటే..?

GPay, Paytm, PhonePe యూజర్లకు అలర్ట్.. మారుతున్న కీలక రూల్ ఏంటంటే..?

UPI News: మోదీ సర్కార్ దేశంలో డీమానిటైజేషన్ తీసుకురావటంతో డిజిటల్ పేమెంట్ ఫిన్ టెక్ కంపెనీలకు మంచికాలం మెుదలైంది. ఆ సమయంలోనే చాలా మంది డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ప్రజల నుంచి ఎలాంటి అదనపు రుసుము లేకుండానే చెల్లింపులను నిర్వహించటానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చొరవ తీసుకుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యాపారంలోని కంపెనీలకు రాయితీల రూపంలో కొంత పరిహారాన్ని లేదా ఆర్థిక మద్ధతును అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా యూపీఐ యూజర్ల భద్రత దృష్ట్యా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఏప్రిల్ 1, 2025 నుంచి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. వీటిని తప్పనిసరిగా యూపీఐ బ్యాంకింగ్ సభ్యులు, యూపీఐ యాప్స్, థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు తప్పక పాటించాల్సిందేనని తాజా సర్కులర్ ద్వారా వెల్లడించింది. దీని లక్ష్యం యూపీఐ నంబర్ల నిర్వహణను క్రమబద్ధీకరించడం, రీసైకిల్ చేసిన మొబైల్ నంబర్ల వల్ల వచ్చే ఎర్రర్స్ నివారించడం, వినియోగదారు సమ్మతి విధానాల్లో పారదర్శకతను నిర్ధారించడంగా ఉన్నాయి. 

Also Read :- ఎల్ఐసీకి అనుకూలం సుప్రీం తీర్పు.. ఆ విషయం దాస్తే క్లెయిమ్స్ రిజెక్ట్..!

వాస్తవానికి ప్రజలు కొంత కాలం పాటు తమ మెుబైల్ నంబర్లను యాక్టివ్ గా ఉంచకపోతే టెలికాం కంపెనీలు వాటి సేవలను నిలిపివేయటం, వాటిని కొత్త కస్టమర్లను అలాట్ చేయటం చేస్తుంటాయి. ఇలా చేయటం వల్ల ఏర్పడే ఎర్రర్లను నివారించటానికి సదరు మార్పులకు సంబంధించిన డేటాను యూపీఐ యాప్స్ ఎప్పటికప్పుడు తమ డేటా బేస్ లలో అప్ డేట్ చేసేలా మార్పులు తీసుకురాబడుతున్నాయి. ఇది తప్పుడు చెల్లింపులు లేదా చెల్లింపుల్లో మోసాలను అరికట్టి యూజర్లకు అధిక భద్రతను అందిస్తుంది.

ఈ క్రమంలో యూపీఐ యాప్స్ యూజర్ల యూపీఐ నంబర్ పోర్ట్ చేయటానికి ముందు తప్పనిసరిగా వారి సమ్మతిని పొందాల్సి ఉంటుంది. ఇది ఓటీపీ ప్రక్రియ ద్వారా నిర్థారించబడుతుంది. అలాగే దీనికోసం బలవంతం చేయకూడదని పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించింది. యూజర్లు పొందే పేమెంట్లను నిలిపివేసేలా బెదిరింపు చర్యలు వద్దని స్పష్టం చేసింది.