HDFC ఖాతాదారులకు అలెర్ట్: ఈ తేదీల్లో నెట్, మొబైల్ బ్యాంకింగ్ బంద్

HDFC ఖాతాదారులకు అలెర్ట్: ఈ తేదీల్లో నెట్, మొబైల్ బ్యాంకింగ్ బంద్

 HDFC బ్యాంక్ సేవలు మరోసారి బంద్ కానున్నాయి. జూన్ 9, 16 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని HDFC బ్యాంక్ మేసేజ్ లు పంపిస్తోంది. ఈ తేదీల్లో తెల్లవారు జామున 3.30 గంటలకు నుంచి ఉదయం 7.30 గంటల వరకు మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని కస్టమర్లు దీనిని గమనించాలని బ్యాంక్ కోరుతోంది. సిస్టమ్ అప్డేట్ లో భాగంగా బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఇటీవల కాలంలో ఇలా చాలాసార్లు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో HDFC బ్యాంకు కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.