హైదరాబాదీలకు అలర్ట్: నల్లాలకు మోటార్లు బిగిస్తే జరిమానా

హైదరాబాదీలకు అలర్ట్: నల్లాలకు మోటార్లు బిగిస్తే జరిమానా

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై జలమండలి కొరడా ఝులిపించింది. నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించిన 84 మందికి జరిమానాలు విధించింది. కాగా, మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్‎ను వాటర్ బోర్డు ప్రారంభించింది. డ్రైవ్‎లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) మాదాపూర్‎లో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. 

పలువురు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. నగరవ్యాప్తంగా 64 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం చేసుకుని.. 84 మందికి పెనాల్టీ విధించారు జలమండలి అధికారులు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. 150 కిలో మీటర్ల నుంచి పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తోందని తెలిపారు. వాటర్ బోర్డు అందిస్తున్న తాగునీటిని నీటిని మొక్కలకు, ఫ్లోర్, వాహనాలను కడగడానికి వినియోగించకూడదని హెచ్చరించారు.

►ALSO READ | సికింద్రాబాద్‎లో దారుణం.. పురుగుల మందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్య

నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా నల్లాలకు మోటార్లు బిగిస్తే 155313కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నల్లాలకు మోటార్లు బిగిస్తే మోటార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరినామాలు విధిస్తామని హెచ్చరించారు.