
PNB News: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక అప్‌డేట్ ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా సేవింగ్స్ అకౌంట్ కలిగిన తన కస్టమర్లకు కొన్ని పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచిస్తోంది.
వివరాల్లోకి వెళితే ఏప్రిల్ 10, 2025 నాటికి కస్టమర్లు తమ కేవైసీ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాల్సిందేనని సమాచారం అందించింది. అయితే ఇది మార్చి 31 నాటికి కేవైసీని నవీకరించిన ఖాతాదారులకు మాత్రం వర్తించదని సమాచారం ఇచ్చింది. బ్యాంక్ పేర్కొన్న విధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే సదరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు మూసివేతకు లేదా తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయని తెలుస్తోంది. అదే జరిగితే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు కస్టమర్లు తమ ఖాతాల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయటానికి కుదరదని గుర్తుంచుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని పూరించటానికి సహాయం కోసం నేరుగా తమకు దగ్గరలోని ఏదైనా బ్యాంక్ శాఖను సందర్శించవచ్చని తెలుస్తోంది. లేదా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఈ ప్రక్రియను -ధృవీకరణకు వెసులుబాటు కల్పించబడుతోంది. మనీలాండరింగ్, ఆర్థిక మోసాలకు పాల్పడే వ్యక్తులు ఇతరుల ఖాతాలను వినియోగించకుండా నివారించటానికి ఖాతాదారుల భద్రత కోసం రిజర్వు బ్యాంక్ ఏర్పాటు చేసింది. తద్వారా మరణించిన వ్యక్తుల ఖాతాలను మోసగాళ్లు అక్రమ కార్యకలాపాలకు వినియోగించకుండా నివారిస్తోంది.
కేవైసీ ప్రక్రియను ఎలా అప్‌డేట్ చేయాలి?
PNB కస్టమర్లు తమ కేవైసీ వివరాలను నవీకరించడానికి అనేక అనుకూలమైన మార్గాలను అందిస్తోంది
- ముందుగా ఖాతాదారులు కేవైసీ ప్రక్రియను ఏదైనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖను సందర్శించండి. అవసరమైన పత్రాలను వ్యక్తిగతంగా సమర్పించటం ద్వారా పూర్తి చేయవచ్చు.
- కస్టమర్లు నేరుగా PNB ONE యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి KYC నవీకరణలను ఆన్‌లైన్‌లో చేసేయెుచ్చు.
- ఇక చివరిగా బ్యాంక్ వద్ద రిజిస్టర్ అయిన ఈ-మెయిల్ ఆధార్ వివరాలను అందించటం ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.