యాదాద్రి, వెలుగు : సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ స్టేట్ లీడర్బూడిద భిక్షమయ్య గౌడ్గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలేరుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి గురించి వివరించారు.
బీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గిందని, కాంగ్రెస్‌కు పెరిగిందని మాజీ సీఎంకు చెప్పారు. కాంగ్రెస్‌ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని మాజీ సీఎం కేసీఆర్అన్నారని భిక్షమయ్య తెలిపారు. బీఆర్ఎస్ ఓటమికి కారణాలపై రివ్యూ చేస్తున్నామని చెప్పారని, నియోజకవర్గాల్లో కూడా పోలింగ్‌బూత్‌ల వారీగా రివ్యూ జరపాలని సూచించినట్టు తెలియజేశారు.