ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దు : గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లను నమ్మి మోసపోవద్దని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. సైదాపురం తనకు సెంటిమెంట్ అని 2014, 2018 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయం సాధించానని చెప్పారు. ఈ సారి కూడా గెలుపు తనదేనని, 40 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుతున్న కాంగ్రెస్ నేతలు  60 ఏండ్లు అధికారంలో ఉంది ఏం చేశారని ప్రశ్నించారు.  భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైదాపురం గ్రామాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేలేదని,  రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జీపీ భవనం, కుల సంఘాలకు బిల్డింగులు కట్టించామన్నారు.  ఈ కార్యక్రమంలో నేతలు కర్రె వెంకటయ్య,  గడ్డమీది రవీందర్ గౌడ్,  అనురాధ బీరయ్య,  స్వరూపా ఆశోక్,  బీర్ల మాధవి మహేశ్,  గొట్టిపర్తి బాలరాజు గౌడ్,  కసావు శ్రీనివాస్ గౌడ్,  పాపట్ల నరహరి,  రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.