ఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్ : ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి  కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే పిటిషన్ లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంప్లీడ్ అయ్యారు.

ALSO READ : మహిళా క్రికెట్ ఎవరు చూస్తారులే అనుకున్నారా.. : బీసీసీఐకి రూ.377 కోట్ల ఆదాయం

2018కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గొంగిడి సునీతకు రూ.10 వేల జరిమానా విధించింది. అక్టోబరు 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే సునీతను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.