సీఎం రేవంత్​ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డిని సోమవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్​కె.నగేశ్​ కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలు గురించి మాట్లాడుకున్నారు.

 అసెంబ్లీ నడుస్తున్నందున సమయంలేదని, ఆగస్టు 15 తర్వాత రమ్మని సీఎం సూచించినట్టు నగేశ్ తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్, నేరేళ్ల ఆంజనేయులు, సత్యనారాయణగౌడ్, సంజీవరావు, సత్యనారాయణ, శ్రీధర్, నారాయణరావు పటేల్​ఉన్నారు.