యాదాద్రిని.. యాదగిరిగుట్టగా మారుస్తం : బీర్ల అయిలయ్య

  • ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి, భద్రాద్రి అంటూ ప్రాస కోసం పేర్లు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. త్వరలోనే యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని ప్రకటించారు. శుక్రవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ఆయనకు అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారికి కొబ్బరికాయ సమర్పించే స్థలాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పేరుతో భక్తులను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. స్వామి వారి సమక్షంలో సేదతీరే అవకాశమే లేకుండా పోయిందన్నారు. భక్తులు సేద తీరేందుకు వీలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.   నెలలో గుట్ట డెవలప్​మెంట్‌‌పై రివ్యూ నిర్వహిస్తామని తెలిపారు.