ముంపు లేకుండా గంధమల్ల రిజర్వాయర్ ను నిర్మిస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ముంపు లేకుండా గంధమల్ల రిజర్వాయర్ ను నిర్మిస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాకుండా గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆలేరులో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే గంధమల్ల కోసం భూసేకరణ వేగంగా నిర్వహించాలని, ఆ వెంటనే రిజర్వాయర్​నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

గంధమల్ల ద్వారా దాదాపు వంద చెరువుల్లో నీరు నింపడానికి చర్యలు తీసుకున్న ఇరిగేషన్ ఆఫీసర్లను ఆయన అభినందించారు. మీటింగ్​లో కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్​వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.