మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని, ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. స్వచ్ఛదనం–-పచ్చదనంలో భాగంగా శుక్రవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురంలోని వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటితే సరిపోదని, చెట్లుగా ఎదిగేంత వరకు పరిరక్షించినప్పుడే బాధ్యత నెరవేరినట్లని పేర్కొన్నారు. నాటిన మొక్కల పరిరక్షణ కోసం ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం బొమ్మలరామారం మండలం రామలింగంపల్లిలో పోచమ్మ విగ్రహం, నాభిశిల ప్రతిష్టాపనోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఉప సర్పంచ్ సురేఖావెంకట్ రెడ్డి, బీర్ల ఫౌండేషన్ డైరెక్టర్ శిఖ ఉపేందర్ గౌడ్, నాయకుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, విలేజ్ సెక్రటరీ రోజా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఎరుకల హేమేందర్ గౌడ్, బందారపు క్షపతి పాల్గొన్నారు. 

మొక్కలు జీవకోటి మనుగడకు మూలాధారం.. 

తుంగతుర్తి, వెలుగు : మొక్కలు జీవకోటి మునగడకు మూలాధారమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛదనం-.. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.  అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పీఏసీఎస్ చైర్​పర్సన్ నాగం జయసుధాసుధాకర్ రెడ్డి, తహసీల్దార్​ శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి బాలు, ఎంపీడీవో సునీత పాల్గొన్నారు.