బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దు : ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, ఇచ్చిన హామీల అమలు చేసిన కాంగ్రెస్ కు ఓటేయాలని  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లంచ్ సమయంలో కంపెనీ ప్రాంగణంలో కార్మికులను కలిసి కాంగ్రెస్​కు ఓటు చేయాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చినమాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.