ఎమ్మెల్యే గొంగిడి సునీతను అడ్డుకున్న గ్రామస్తులు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు మర్లవడుతున్నారు. ఎక్కడిక్కడ అడ్డుకుని  నిలదీస్తున్నారు. సోమవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని గ్రామస్తులు అడ్డుకోగా.. ఇవాళ ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీతకు నిరసన సెగ తగిలింది. కొలనుపాకలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సునీతను కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అనర్హులకు, వార్డ్ మెంబెర్లకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించారని ఆందోళనకు దిగారు. శిలాఫలకం దగ్గరికి వెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. టెంట్ పీకేసి, కుర్చీలను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులు  రోడ్డుపై బైఠాయించడంతో ఆలేరు నుంచి సిద్ధిపేటకు వెళ్లే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామైంది.