మైదానంలో కోహ్లీ ఎంత అగ్రెస్సివ్ గా ఉంటాడో ప్రత్యేకమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే విరాట్.. సహచర ప్లేయర్లను ప్రోత్సహిస్తుంటాడు. కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమైనా అంటే బ్యాట్ తో పాటు నోటితో సమాధానం చెప్పడం ఇప్పటికే చాలా సార్లు చూసాం. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తేనే కోహ్లీ రెచ్చిపోతాడు అని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ లీస్ మాత్రం కోహ్లీ ప్రవర్తనను తప్పు పడుతూ అతడిని ఇడియట్ అని సంచలన కామెంట్లు చేసాడు.
ఎడ్జ్ బస్టన్ వేదికగా 2022 లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్ బస్టన్ లో ఐదవ టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 83 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోను కోహ్లీ స్లెడ్జింగ్ చేసాడని..బెయిర్ స్టో సెంచరీ చేసిన తర్వాత అతనికి ఇంగ్లాండ్ అభిమానులు బుద్ధి చెప్పారని ఓపెనర్ లీస్ చెప్పుకొచ్చాడు.
లీస్ మాట్లాడుతూ " నేను క్రికెట్ లో అనుభవం లేని ఆటగాడిని కానీ కోహ్లీ ఎంతో అనుభవంతో పాటు క్రేజ్ సంపాదించాడు. దీన్ని అవకాశంగా తీసుకొని అతడు స్లెడ్జింగ్ చేసేవాడు. గ్రౌండ్ లో అందరూ సమానమే. ఎవరైనా నన్ను భయపెట్టడానికి ప్రయత్నించినా నేను సహించను. ఈ మ్యాచ్ లో కోహ్లీ నాతో బెయిర్ స్టో ను స్లెడ్జింగ్ చేసాడు. అతను ఎంత గొప్ప క్రికెటర్ అయినా నా దృష్టిలో అతడు ఒక ఇడియట్". అంటూ Telegraph.co.uk పుస్తకంలో తెలిపాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు మాత్రమే చేసి విఫలం కాగా.. భారత్ ఈ టెస్టు మ్యాచ్ లో ఓడిపోయింది.