
‘అమెజాన్’ కంపెనీకి చెందిన ‘అలెక్సా ఎకో స్మార్ట్ డివైజెస్’కు కొత్త ఫీచర్స్ రానున్నాయి. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ‘స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్‌ప్లే’లలో ఈ ఫీచర్స్ ఉంటాయి. ‘ద ఎకోడాట్, ద ఎకో ఇన్‌పుట్, ద ఎకో, ఎకో ప్లస్, ద ఎకో షో, ఎకో షో 5, ద ఎకో షో 8, ద ఎకో స్టూడియో’ అనే డివైజ్‌లు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ‘డ్రాప్ ఇన్’ అనే ఫీచర్ ఉంది. దీనిలోనే కొత్త ఫీచర్ అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం ఇంట్లో ఎక్కువ ‘ఎకో డివైజెస్’ వాడుతుంటే, వాటిని గ్రూప్‌గా కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏ స్పీకర్ నుంచైనా మాట్లాడొచ్చు.‘అలెక్సా.. డ్రాప్ ఇన్ ఆల్ డివైజెస్’ అంటే గ్రూప్‌లోని అన్ని డివైజెస్‌పై వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం చెప్పాలనుకున్నా, అలెక్సా ద్వారా చెప్తే అందరికీ వినిపిస్తుంది. వీటికి రెస్పాండ్ అయ్యేందుకు కూడా అవే స్పీకర్స్ వాడొచ్చు. ఒక స్పీకర్ నుంచి అడిగే ప్రశ్నలకు, మరో స్పీకర్‌తో సమాధానం చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో అలెక్సా యాప్ ద్వారా ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. వీటితోపాటు మరికొన్ని ఫీచర్స్ కూడా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయని కంపెనీ చెప్తోంది.