జ్వెరెవ్‌‌‌‌ శుభారంభం

జ్వెరెవ్‌‌‌‌ శుభారంభం

న్యూయార్క్‌‌‌‌: సీజన్‌‌‌‌ చివరి గ్రాండ్‌‌‌‌స్లామ్ యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో నాలుగో సీడ్ అలెగ్జాండ్ జ్వెరెవ్‌‌‌‌, పారిస్ ఒలింపిక్‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్  జెంగ్‌‌‌‌ క్విన్వెన్‌‌‌‌ శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌‌‌‌లో జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో తమ దేశానికే చెందిన మాగ్జిమిలియన్‌‌‌‌ మార్గెనర్‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌‌‌‌లో 17వ సీడ్  యుగో హంబర్ట్ (ఫ్రాన్స్‌‌‌‌) 6–3, 6–4, 6–4తో తియాగో (బ్రెజిల్‌‌‌‌)పై గెలిచాడు.

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ఏడో సీడ్ జెంగ్‌‌‌‌ (చైనా) 4–6, 6–4, 6–2తో అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవాను ఓడించింది. మరో మ్యాచ్‌‌‌‌లో 12వ సీడ్ రష్యా ప్లేయర్ డారియా కసట్కినా 6–2, 6–4తో జాక్వెలిన్ క్రిస్టియాన్ (రొమేనియా)ను ఓడించగా, 24వ సీడ్ వెకిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో బిరెల్ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్‌‌)  3–6, 6–3, 6–4తో కార్లీ (అర్జెంటీనా)పై గెలిచింది. గ్రీస్ స్టార్ మరియా సకారి.. చైనాకు చెందిన వాంగ్ యఫన్‌‌‌‌తో పోరులో 2–6తో తొలి సెట్ కోల్పోయిన తర్వాత భుజం గాయం కారణంగా మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకుంది.