
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్‌దే..
- ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతా : అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్‌టౌన్, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల కారణంగానే తాను ఓడిపోయానని, నైతిక విజయం కాంగ్రెస్‌దేనని అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. చెల్లని ఓట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని కోరారు. 50 శాతం ప్లస్ వన్ ఓట్లు రాకపోయినా విజేతను ప్రకటించడం సరికాదన్నారు.
.తనపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసిన దుష్ర్పచారాన్ని గ్రాడ్యుయేట్లు పట్టించుకోలేదన్నారు. గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతానని, సీఎం, పీసీసీ చైర్మన్ ఆదేశిస్తే కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనకు సహకరించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.