జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌‌‌‌లో నిర్వహించనున్న ప్రోగామ్‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ పూజశ్రీ ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి జపాన్‌‌‌‌ బయలుదేరగా  పూజశ్రీని చైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి ఇన్ స్పైర్ పోటీల్లో పూజశ్రీ తయారుచేసిన ‘వీల్ యాక్సిల్ కెమెరా’ అవార్డ్​ సాధించిందని, ఆ ప్రదర్శనకు జపాన్ లో జరగనున్న సకుర ప్రోగ్రామ్‌‌‌‌కు ఆహ్వానం అందినట్లు చెప్పారు. జపాన్ పర్యటనకు బయలుదేరిన  పూజశ్రీని  పెద్దపల్లి డీఈవో మాధవి, డీఎస్‌‌‌‌వో రవినందన్ రావు అభినందించారు.