రాష్ట్ర స్థాయి నెట్ ‌‌బాల్ ​పోటీలకు అల్ఫోర్స్​ స్టూడెంట్స్

కొత్తపల్లి, వెలుగు : రాష్ట్ర స్థాయి జూనియర్​ నెట్​బాల్​ పోటీలకు అల్ఫోర్స్​ స్టూడెంట్స్​ ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్​ నరేందర్​రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలన్నారు.  

సెప్టెంబర్​ 29న నూకలమర్రిలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఆర్.కార్తీక్, ఎస్.అజయ్, జి.అంజిమనీశ్వర్​రెడ్డి, బి.శివాజీచారి, జి.మనిచంద్, జి.సిరిచరణ్ గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వివరించారు. శుక్రవారం ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు.