కరీంనగర్ టౌన్, వెలుగు : ఈ నెల 17న అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు కాలేజెస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లి అల్ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్లో చైర్మన్ అమాట్ అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్–2024 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 22న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని అల్ఫోర్స్ స్కూల్‌లో ఒలింపియాడ్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు.
రామానుజన్ విశిష్టత, ఆయన సేవలు విద్యార్థులకు తెలియజేసేందుకు ఏటా విద్యార్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 17న ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని వివిధ అల్ఫోర్స్ స్కూల్స్, కాలేజీల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91602 94441, 93982 30614 సంప్రదించాలన్నారు.