మ్యాథ్స్​ ఒలింపియాడ్‌‌‌‌లో గోల్డ్ మెడల్స్​

కొత్తపల్లి, వెలుగు: మ్యాథ్స్​కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని అల్ఫోర్స్​ చైర్మన్​నరేందర్​రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన మ్యాథ్స్​ ఒలింపియాడ్ ​టెస్ట్‌‌‌‌లో అల్ఫోర్స్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారు. శనివారం కొత్తపల్లిలోని ఇ- టెక్నో స్కూల్‌‌‌‌లో అభినందన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెస్ట్‌‌‌‌లో కె.హవిష్​తేజ్, ఎ.విహాన్​కృష్ణ, జి.జోయల్ డేవిస్, బి.కార్తికేయ, సీహెచ్.దుర్శెట్టి, శివస్మరణ్​రెడ్డి, టి.అమితవిక్రమ్, ఎ.గౌతమి, హర్ష అమిరిశెట్టి, అక్షిత, బి.ఆకృతి గోల్డ్‌‌‌‌మెడల్స్‌‌‌‌తోపాటు సర్టిఫికెట్లు గెలుపొందారన్నారు.