- సెబీ కొత్త ప్రపోజల్
న్యూఢిల్లీ : ఆల్గో ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పార్టిసిపేట్ చేసేలా సెబీ కొత్త రూల్స్ ప్రపోజ్ చేసింది. ఆల్గో ట్రేడింగ్‌తో వేగంగా ఆర్డర్లు పూర్తవుతాయి. లిక్విడిటీ కూడా మెరుగవుతుంది. కొత్త ప్రపోజల్స్ అమల్లోకి వస్తే రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఆల్గో ట్రేడింగ్ చేయడానికి వీలుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ (డీఎంఏ) ద్వారా ఆల్గో ట్రేడింగ్‌ను సెబీ గతంలో లాంచ్ చేసింది. కానీ, ఈ ఫెసిలిటీ కేవలం ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకే అందుబాటులో ఉంది.
రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా అందుబాటులో ఉంచాలని తాజాగా ప్రపోజ్ చేసింది. ఆల్గో ట్రేడింగ్‌లో పాల్గొనే ఇన్వెస్టర్లు, స్టాక్ బ్రోకర్లు, ఆల్గో ప్రొవైడర్లు, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎంఐఐ) ల హక్కులు, బాధ్యతలను క్లియర్‌గా సెబీ పేర్కొననుంది. ఆల్గో ఆర్డర్లకు యునిక్ ఐడెంటిటీని ఇస్తారు. ఆల్గో ఆర్డర్లను సవరించాలంటే ఎక్స్చేంజ్‌ల అనుమతిని బ్రోకర్లు తీసుకోవాల్సి ఉంటుంది.