AliaBhatt: భారీ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌తో అలియా ‘ఆల్ఫా’.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్

మహిళా గూఢచారి చిత్రం 'అల్ఫా'(Alpha) రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. వచ్చే ఏడాది క్రిస్మస్ రోజున థియేట్రికల్గా రిలీ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రలో నటించారు. శివ్ రావెల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ (Yash Raj Films) దీన్ని నిర్మిస్తోంది. ఈ స్పై యూనివర్స్లోలో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంలో మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అనిల్ కపూర్, బాబీదేవోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read :- రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్

ఈ మూవీలో బాబీ, అలియాలకు మధ్య భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల సమక్షంలో యుద్దపోరాట సన్నివేశాలను తీస్తున్నట్లు టాక్. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెట్లో షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఇందులో హీరో హృతిక్ రోషన్ అలియా గురువు పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం అలియా భ‌‌‌‌‌‌‌‌ట్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన ‘జిగ్రా’(Jigra) మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. వాసన్ బాల దర్శకుడు. కరణ్ జోహార్,  అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తుంటే అర్థమవుతోంది.

తమ్ముడిని రక్షించేందుకు దేనికైనా తెగించే అక్క పాత్రలో అలియా భట్ నటించింది. తమ్ముడిగా ‘ఆర్చీస్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ వేదాంగ్ రైనా నటించాడు.  రాహుల్ రవీంద్రన్ కీల‌‌‌‌‌‌‌‌క పాత్ర పోషించాడు. దసరా సందర్బంగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.