దేవర చిత్రంలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

దేవర చిత్రంలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

ఎన్టీఆర్ హీరోగా  నటించిన దేవర చిత్రం మొదటిభాగం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షధకుల ముందు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాలలోపాటూ బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్ మరియు సినీ నిర్మాత కరణ్ జోహార్ తో కలసి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

దీంతో అప్పటినుంచి  దేవర చిత్రంలో అలియా భట్ కూడా కామియే అప్పీయరెన్స్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న నటి అలియా భట్ తాజాగా ఈ విషయంపై స్పందించింది. ఇందులో భాగంగా తాను దేవర చిత్రంలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

అలాగే ప్రస్తుతం తాను జిగ్రా అనే చిత్రంలో నటించానని ఈ చిత్రం అక్టోబర్ 11వ తారీఖున విడుదల కాబోతోందని కావున ప్రతీ ఒక్కరూ తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలసి థియేటర్లలో చూడాలని కోరింది.