RRR అప్డేట్: సీత లుక్ లో ఆకట్టుకుంటున్న ఆలియా

RRR అప్డేట్: సీత లుక్ లో ఆకట్టుకుంటున్న ఆలియా

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే కొమరం భీమ్ గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్స్ రిలీజ్ చేసిన రాజమౌళి టీమ్.. లేటెస్ట్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ లుక్‌ ని రిలీజ్ చేసింది. సోమవారం ఆలియా బర్త్ డే సందర్భంగా ఆమెకు గిఫ్ట్ గా ఆర్ఆర్ఆర్ నుంచి ఆలియా లుక్ రిలీజ్ చేసింది యూనిట్.  ట్విట్టర్ లో ఈ లుక్ రిలీజైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆలియా.. చరణ్ కి జంటగా  సీత పాత్రలో ఎంతో పవర్‌ఫుల్ రోల్‌ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ అన్నీ ప్రధాన భాషల్లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ శ్రణ్, ఎన్టీఆర్‌కి జంటగా బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే.