అలియా భట్, వేదాంగ్ రైనా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’(Jigra). వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా ఈ సినిమాని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా రిలీజయింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాడు.
దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జిగ్రా మూవీ థియేటర్లలో రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కేవలం రూ.30 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిర్మాతలకు అరవై కోట్లకుపైనే నష్టాలను తెచ్చిపెట్టింది.
జిగ్రా ఓటీటీ:
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. జిగ్రా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్దమైంది. డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ నవంబర్ 30 లోపు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అప్డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
జిగ్రా కథ:
బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆపదలో ఉన్న తమ్ముడిని రక్షించేందుకు దేనికైనా తెగించే అక్క పాత్రలో అలియా భట్ నటించింది. తమ్ముడిగా ‘ఆర్చీస్’ ఫేమ్ వేదాంగ్ రైనా నటించాడు. రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు.
ALSO READ | నోరెళ్లబెట్టడం ఖాయం: భారీ సినిమాలకు కేరాఫ్ మైత్రి.. లిస్టులో అన్ని క్రేజీ ప్రాజెక్టులే
అయితే ఈ మూవీలో చిన్నప్పటినుంచి తమ్ముడి బాధ్యతలను సత్యభామ(అలియా భట్) చూసుకుంటుంది. తన కజిన్ బ్రదర్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన తమ్ముడు అంకుర్ (వేదాంగ్ రైనా) అనుకోకుండా డ్రగ్స్ కేసులో చిక్కుకుంటాడు. దీంతో అక్కడి గవర్నమెంట్ అతడికి మరణ దండన విధిస్తారు. ఇక తన తమ్ముడి నిర్దోషి అని తెలుసుకుని ఎలాగైనా రక్షించుకోవాలని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో తనకి ఎదురైనా కష్టాలేంటీ? అసలు తన తమ్ముడు డ్రగ్స్ కేసులో ఎలా చిక్కుకున్నాడు? చివరికి తన తమ్ముడిని కాపాడుకుందా ? లేదా అనేది మిగతా స్టోరీ.