మీకు నా ముద్దులు : ఇంగ్లీష్ హీరోయిన్ కు.. తెలుగు నేర్పిస్తున్న హిందీ హీరోయిన్..

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhar) నటిస్తున్న క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్టు హార్ట్ ఆఫ్ స్టోన్(Heart of stone ). హాలీవుడ్ ప్రముఖ నటులు గాల్ గాడోట్, జమీర్ డోర్నన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న నెట్ఫ్లిక్స్(Netflix)లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆలియా ఈ సినిమాలో మొదటిసారి నెగిటీవ్ రోల్ లో కనిపించనుందట.

ఇక హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఆలియా, గాల్ గాడోట్, జమీర్ డోర్నన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి ఆలియా హాలీవుడ్ బ్యూటీ గాల్ గాడోట్ కు తెలుగు నేర్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో ఆలియా.. గాల్ గాడోట్ కు తెలుగులో.. అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు.. అనే రెండు పదాలను నేర్పించింది. చాలా ఫన్నీ గా సాగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలోఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన నెటిజన్స్ చిత్ర విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఒక హిందీ హీరోయిన్ ఇంగ్లీష్ హీరోయిన్ కు తెలుగు నేర్పించడం చాల బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ :అద్దిరిపోయే కాంబో సెట్ చేసుకున్న.. డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్.. దేనికో తెలుసా?

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన భారీ విజయంతో.. అన్ని ఇండస్ట్రీల చూపు తెలుగు ఇండస్ట్రీపై పడింది. తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికే హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్ర యూనిట్ ఈ వీడియో చేసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా గ్లోబల్ వైడ్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ సాధిస్తున్న విజయాన్ని చూసి.. తెలుగు ఆడియన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.