Alia Bhatt Thriller: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్లో అలియా భట్.. డైరెక్టర్ ఎవరంటే?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ (Alia Bhatt) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో ఒదిగిపోతుంది. ఏ స్టోరీ అయిన వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

తాజాగా ఈ బ్యూటీ హారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ యూనివర్స్లో స్త్రీ, స్త్రీ2, ముంజ్యా, భేడియా వంటి సినిమాలను తెరకెక్కించిన నిర్మాత దినేష్ విజన్లో నటించనుందట. అదే అంశంతో ఛముండా అనే పేరుతో మరో మూవీ మాటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారత మేకర్స్.

Also Read:-ఆదిత్య 369 సీక్వెల్ స్టోరీ, హీరో రెడీ.. కొత్త గెటప్ లో..

ఈ మూవీలో అలియాభట్ కీ రోల్లో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. కాగా ఈ మూవీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలియా భట్ చివరిగా వాసన్ బాలా తెరకెక్కించిన జిగ్రాలో వేదాంగ్ రైనాతో కలిసి నటించింది.