![ఆలియా లిప్స్టిక్ లొల్లి.. రణ్బీర్పై రెచ్చిపోతున్న నెటిజన్స్](https://static.v6velugu.com/uploads/2023/08/Alia-Bhatt's-lipstick-controversy-leaves-netizens-fuming_yhro8zpcK0.jpg)
కొన్నిసార్లు సరదాగా చేసిన కామెంట్స్ కూడా పెద్ద దుమారాన్ని రేపుతాయి. వాటికి ఆడియన్స్ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతారో కూడా అర్థంకాదు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia bhat) కు ఎదురైంది. ఇటీవల ఆమె తన అప్ కమింగ్ హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్(Heart of stones) ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా తన భర్త రణ్బీర్(Ranbir kapoor)పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఒకేసారి రణ్బీర్ తనను లిప్‌స్టిక్‌ను తుడిచేసుకోమన్నాడని, ఎందుకంటే తనకు ఆలియా నేచురల్ లిప్ కలర్ ఇష్టమని చెప్పాడని చెప్పుకొచ్చింది ఆలియా. ఈ కామెంట్స్ చాలా సరదాగా చేసింది ఆలియా. కానీ ఆ కామెంట్స్ ను నెటిజన్స్ మాత్రం అంత సరదగా తీసుకోలేదు. రణ్బీర్పై ట్రోలింగ్ తో రెచ్చిపోయారు.
రణ్బీర్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అని, పెళ్ళికి ముందు తన గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఈ కారణంగానే అతనికి దూరమయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అలియా వరకు వెళ్లడంతో.. వాటికి పులిష్టాప్ పెట్టె ప్రయత్నం చేసింది. ఆ కామెంట్స్ కు సమాధానంగా.. తన ఇంస్టాలో తన ఫొటోస్ ను షేర్ చేసింది. దానికి నో వర్డ్స్.. ఓన్లీ వైబ్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక్క పోస్ట్ తో వివాదానికి పులిషాట్ప్ పెట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.