డియోల్‌‌తో ఢీ.. సూపర్ ఏజెంట్‌‌గా వస్తున్న ఆలియా

డియోల్‌‌తో ఢీ.. సూపర్ ఏజెంట్‌‌గా వస్తున్న ఆలియా

ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న అలియా భట్.. ఇప్పుడో సూపర్ ఏజెంట్‌‌గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌‌ సంస్థ యశరాజ్‌‌ ఫిల్మ్స్‌‌ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’లో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది.  శివ్ రావేల్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘యానిమల్‌‌’తో మెప్పించిన బాబీ డియోల్‌‌ విలన్‌‌గా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  ప్రస్తుతం అలియా భట్, బాబీ డియోల్ కాంబినేషన్‌‌లో వచ్చే యాక్షన్‌‌ సీన్స్‌‌ను చిత్రీకరిస్తున్నారు. 

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌‌లో హై సెక్యూరిటీ మధ్య ఈ షూట్ జరుగుతోంది.  హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌ ఈ సీన్‌‌కు వర్క్ చేస్తున్నారు. సినిమాకు ఎంతో కీలకమైన సీన్ ఇదని తెలుస్తోంది. ఐదు నుంచి ఆరు యాక్షన్‌‌ సీక్వెన్సులు ఉన్న ఈ మూవీ కోసం నాలుగు నెలలు పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది అలియా భట్. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌‌‌‌లో అలియా ఇందులో కనిపించబోతోంది.