సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ గుర్క కుమార్.. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారంటూ.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీనిపై విచారణ జరుపగా.. నిధుల గోల్ మాల్ జరిగినట్టు తేలింది. దీంతో సర్పంచ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి.