చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు పోటీగా అలీబాబా ఏఐ

చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు పోటీగా అలీబాబా ఏఐ

న్యూఢిల్లీ: ఓపెన్‌‌‌‌ ఏఐ చాట్ జీపీటీ,   చైనా డీప్‌‌‌‌సీక్‌‌‌‌ ఏఐ మోడల్స్‌‌‌‌ను తలదన్నే ఏఐ మోడల్‌‌‌‌ను  డెవలప్‌‌‌‌ చేశామని చైనా ఈ–కామర్స్ కంపెనీ  అలీబాబా ప్రకటించింది. ఏఐ మోడల్‌‌‌‌ క్వెన్‌‌‌‌2.5 మ్యాక్స్‌‌‌‌ను కంపెనీ లాంచ్ చేసింది.   ‘చాట్‌‌‌‌జీపీటీ–4ఓ, డీప్‌‌‌‌సీక్‌‌‌‌–వీ3, మెటా లామా–3.1–405బీ కంటే క్వెన్‌‌‌‌ 2.5 మ్యాక్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది’ అని అలీబాబా క్లౌడ్ డివిజన్  పేర్కొంది. 

డీప్‌‌‌‌సీక్‌‌‌‌–వీ3 మోడల్‌‌‌‌ ప్రకటన వచ్చినప్పటి నుంచి  యూఎస్ టెక్ కంపెనీల షేర్లు భారీగా పడుతున్నాయి. ఈ చైనీస్ కంపెనీ సిలీకాన్ వ్యాలీలో సంచలనం సృష్టించింది. తాజాగా అలీబాబా కూడా అడ్వాన్స్డ్‌‌‌‌ ఏఐ మోడల్‌‌‌‌ను లాంచ్ చేసి టాప్ కంపెనీలకు సవాలు విసిరింది. కాగా, ఏఐ యూజర్లను ఆకర్షించేందుకు ఈ ఏఐ కంపెనీలు తమ సర్వీస్‌‌‌‌లను తక్కువ రేటుకే అందించడానికి ముందుకొస్తున్నాయి.