ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (UFOs)లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అన్న విషయాలపై ఎన్నో ఏళ్లుగా ఎన్నో వాదనలు ఉన్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటివరకు ఎవరూ బయటపెట్టలేకపోయారు.
ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెబుతుంటారు. యూఎఫ్‌వోలను ఫ్లయింగ్ సాసర్లు అని కూడా అంటారు.
కాని ఇప్పుడు సోషల్ మీడియాలో the.ufo.street.journal అనే యూజర్ నుంచి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ అయిన వీడియోను చేస్తే నిజంగానే భూమిమీద గ్రహాంతర వాసులు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది.
గ్రహాంతర వాసుల గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఏలియన్స్ అంటే అంతరిక్షంలో ఉండే గ్రహాలు కాదని భూమిపై నివసించే మానసపుత్రికలని చాలామంది చెబుతుంటారు. గ్రహాంతరవాసులు భూమిపై నివసిస్తున్నారని మనుషుల రూపంలో భూమిపై ఉన్నారని కొంతమంది అంటున్నారు.
గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఏలియన్ అంటే వేరే గ్రహం మీద నివసించే వారు. గ్రహాంతరవాసులంటే మనుషుల మానస పుత్రిక అని చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ ఏలియన్స్ యూఎఫ్ఓల ద్వారానే భూమిపైకి వస్తాయన్నారు. గ్రహాంతర వాసులు మనుషుల రూపంలో భూమిపై నివసిస్తున్నారని, మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారని కొందరు అంటున్నారు.
గ్రహాంతరవాసుల గురించి అమెరికాశాస్త్రవేత్తల దగ్గర చాలా సమాచారం ఉంది. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారని వారు చెబుతున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని నిర్దారిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోలో ఓ కుక్క నుంచి తప్పించుకోవడానికి గ్రహాంతర వాసి పరిగెత్తుతూ కనిపించింది. ఆ తరువాత పరిగెత్తే జీవి రోడ్డుపక్కన ఉన్న చెత్తకుండీలో దాక్కొంది. ఆ కుక్కకు ఆ వింత ప్రాణి ఎక్కడికి వెళ్లిందో కనపడలేదు. అటూ ఇటూ చూసి అక్కడి నుంచి ఆ కుక్క వెళ్లిపోయింది. కుక్క వెళ్లడాన్ని గమనించిన వింత ప్రాణి డస్ట్ బిన్ లోనుంచి బయటకు దూకి పరిగెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.