గ్రహాంతరవాసులు ఉన్నారా.. ఫ్లయింగ్ సాసర్లు ఉన్నాయా.. వాటి ద్వారా గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చి వెళుతుంటారా.. ఏంటీ హాలీవుడ్ మూవీస్ కథ చెబుతున్నారు ఏంటీ అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో మరోసారి డిస్కషన్ రైజ్ చేస్తుంది. మయామి దేశంలో జరిగిన ఓ ఘటనతో.. ఆ ప్రదేశం నుంచి వచ్చిన వీడియోలు ఇప్పుడు ఏలియన్స్ పై ఎక్కడ లేని ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది.
మనిషి అంటే మనిషి కాదు.. మనిషి ఆకారంలో.. సినిమాల్లో చూస్తున్నట్లు ఉండే ఏలియన్స్ ఆకారం ఒకటి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ దేశంలోని కార్లు, మనుషులు, ఇతర వస్తువులు అన్ని చక్కగా వీడియోలో రికార్డ్ అయినా.. ఒకే ఒక్క ఆకారం మాత్రం ఏలియన్స్ ను పోలి ఉంది. ఆ ఏలియన్ గా చెప్పబడుతున్న ఆకారం చుట్టూ ఉన్న అన్ని వస్తువులు మంచిగానే కనిపిస్తున్న.. అక్కడ మాత్రం డిఫరెంట్ గా ఉండటాన్ని చూసిన నెటిజన్లు.. అది ఏలియన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఏలియన్ షాపింగ్ కోసం.. ఇతర గ్రహాల నుంచి మాల్ కు వచ్చాయంటూ ట్యాగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారం ఏంటో చూద్దాం...
I zoomed in on one of the tiktok videos about the Miami mall creature, so you can see the gray creature walking in between these police cars and the building. pic.twitter.com/SoAt0Cx0jR
— Matt French (@MattFrenchArt) January 5, 2024
అది మియామి దేశం.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా.. యువతీ, యువకులు ఓ షాపింగ్ మాల్ కి వెళ్లారు. బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు. తాగిన మత్తు కదా.. ఇగోతో మొదలైన వాగ్వాదం.. గొడవ వరకు వెళ్లింది. ఇంకేముందీ.. కుర్రోళ్లు అందరూ కుమ్మేసుకున్నారు.. పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు. విషయం తెలిసి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 20 పోలీస్ జీపులు.. వంద మంది పోలీసులు వచ్చారు. లాఠీఛార్జి చేసి కంట్రోల్ చేశారు.
ఈ ఇష్యూ మొత్తాన్ని ఓ వ్యక్తి.. ఆ మాల్ బిల్డింగ్ పై నుంచి షూట్ చేశాడు.. అప్పుడు కనిపించింది వీడియో.. ఆ ఏలియన్.. మియామి షాపింగ్ మాల్ దగ్గర ఏలియన్.. షాపింగ్ చేయటానికి వచ్చిన ఏలియన్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముదీ.. మియామిలో పోస్ట్ చేస్తే.. భూమండలం అంతా వైరల్ అయ్యింది. కోట్లకు కోట్ల వ్యూస్ వచ్చాయి.. పెద్ద డిస్కషన్ అయిపోయింది.
సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఏలియన్ వీడియోపై చివరకు మియామి దేశంలోని అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులు స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఉన్న ఏలియన్ కాదంటున్నారు. మా దేశంలోని ఏ గ్రహాంతర వాసులు రాలేదని స్పష్టం చేస్తూ.. వీడియోలో ఉన్నది.. నడిచే వ్యక్తి నీడ అని స్పష్టం చేశారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు లేదా మాల్ కు వచ్చిన వారిలో ఎవరైనా వ్యక్తి అయ్యి ఉండొచ్చని.. అతని నీడ.. కెమెరాలో అలా పడిందని వివరించారు పోలీసులు. మరి మనిషి అయితే మనిషిలా కనిపించాలి కదా.. నీడలా ఎందుకు కనిపిస్తుంది.. మీ పోలీసు వాహనాలు, బిల్డింగ్స్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి కదా అంటూ.. ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు నెటిజన్లు..
మొత్తానికి ఏలియన్.. మియామి వచ్చిందా లేదా అనేది పక్కనపెడితే.. ఏలియన్స్ ఉండే ఉంటారనే చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.