అలిపిరి బాంబు దాడి కేసు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితులు

 అలిపిరి బాంబు దాడి కేసు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితులు

తిరుపతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో  ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 4వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది.  2003 అక్టోబర్‌లో  సీఎం హోదాలో తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న  చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో మాజీ నక్సలైట్ లు రాంమ్మోహన్ రెడ్డి, నరసింహ రెడ్డి, చంద్రలను దోషులుగా నిర్దారిస్తూ..  2014 లో కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితులకు  4 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 9ఏళ్లుగా ఈ కేసులో వాదనలు   కొనసాగాయి. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం ముగ్గురు ముద్దాయిలను నిర్థోషిలుగా కోర్టు  తీర్పు వెలువరించింది.