IND vs PAK: ఆట తక్కువ.. వేషాలు ఎక్కువ: డగౌట్‌లో పాక్ ఆల్‌రౌండర్ వెర్రి నవ్వులు

IND vs PAK: ఆట తక్కువ.. వేషాలు ఎక్కువ: డగౌట్‌లో పాక్ ఆల్‌రౌండర్ వెర్రి నవ్వులు

ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై ఘనమైన రికార్డు కలిగిన భారత మహిల జట్టు.. దాయాదుల పోరులో మరోసారి పైచేయి సాధించింది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 06) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో హర్మన్ సేన ఘన విజయం సాధించింది. తొలుత పాక్‌ను 105 పరుగుల స్వల్ప కట్టడి చేసి.. అనంతరం లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలివుండగానే చేధించింది. ఈ గెలుపు సంతోషాన్ని పక్కనపెడితే, మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండర్ చర్యలు భారత అభిమానులను ఎక్కువుగా బాధిస్తున్నాయి. 

క్యాచ్ చేజారిందని వెర్రి నవ్వులు

ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ ఆశా శోభనా సునాయాస క్యాచ్‌ను జారవిడిచింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాక్ ఓపెనర్ మునీబా అలీ బౌండరీ కోసం స్కూప్-ఫ్లిక్ ఆడగా.. బంతి నేరుగా షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శోభనా వైపు దూసుకొచ్చింది. ఇది రెగ్యులేషన్ క్యాచ్ అయినప్పటికీ, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆశా సునాయాస క్యాచ్‌ని మిస్‌ చేసింది. అంత తేలికైన అవకాశాన్ని వదులుకుందని పాక్  ఆల్‌రౌండర్ అలియా రియాజ్ పగలబడి నవ్వింది. వెంటనే తన చర్యలు స్క్రీన్‌పై డిస్ ప్లే అవ్వడం చూసి ముఖంపై చేతులు అడ్డుపెట్టుకుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

సెమీస్‌ చేరే అవకాశాలు

పాక్‌పై గెలిచినప్పటికీ భారత్‌ పాయింట్ల పట్టికలో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో దారుణంగా ఓడటమే అందుకు ప్రధాన కారణం. 58 పరుగుల భారీ తేడాతో ఓడటంతో భారత నెట్‌ రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. మన కంటే పాకిస్థాన్‌ (+0.555) నెట్‌ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉంది. సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకోవాలంటే భారత్‌ రాబోయే శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించడం తప్పనిసరి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్‌-2లో ఉన్న జట్లు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

ALSO READ | ENG vs PAK 1st Test: పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. ఫ్రీ ఎంట్రీ అయినా ప్రేక్షకులు లేరు