![కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష ధర్నా](https://static.v6velugu.com/uploads/2025/02/all--party-protest-in-front-of-the-collectorate-demanding-resolution-of-the-problems-of-workers-of-six-panchayats-in-lakshmidevi-palli-mandal_swM4qbfPy1.jpg)
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆరు పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ అన్యాయంగా జీతాల్లో కోత విధిస్తూ కార్మికులను అధికారులు మోసం చేస్తున్నారన్నారు.
కార్మికుల సంక్షేమాన్ని ఆఫీసర్లు విస్మరించారన్నారు. గత పది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ నేతలు భూక్యా రమేష్, లగడపాటి రమేశ్ అన్వర్, ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వాసం రామకృష్ణ పాల్గొన్నారు.