బ్యాంకుల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో

బ్యాంకుల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో

డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకే

న్యూఢిల్లీ : డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని బ్యాంకులు తమ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో, క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించేలా డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే చేయాలని  డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బ్యాంకులకు సూచించింది.  అగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 లోపు ఈ పని పూర్తి చేయాలని  కోరింది. బ్యాంకుల్లో కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లలో రూ.5 లక్షల వరకు డీఐసీజీసీ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్ చేస్తుంది. కమర్షియల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లోని డిపాజిట్లను ఈ స్కీమ్ కవర్ చేస్తుంది. చిన్న డిపాజిటర్లను కాపాడడంలో  డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకంగా ఉందని, బ్యాంకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూజర్లలో నమ్మకం పెంచుతోందని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతోందని డీఐసీజీసీ  ఓ సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

ALSO READ :కంప్యూటర్ సైన్స్ సీట్లన్నీ నిండినయ్

బ్యాంకులు తమ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగోను, క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే చేయడం ద్వారా సంబంధిత బ్యాంక్  డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద కవర్ అవుతోందనే విషయం కస్టమర్లకు తెలుస్తుందని వెల్లడించింది.  సెప్టెంబర్ 1  నుంచి అన్ని బ్యాంకులు ఈ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలోకావాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 2,027 బ్యాంకులు డీఐసీజీసీ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. ఇందులో 140 కమర్షియల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 43 రీజినల్ రూరల్ బ్యాంకులు, రెండు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియా బ్యాంకులు ఉన్నాయి. 12 స్మాల్ ఫైనాన్స్, 1,887 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.  ప్రస్తుతం బ్యాంకుల్లోని రూ.5 లక్షల వరకు గల డిపాజిట్లకు ఇన్సూరెన్స్ కవరేజి ఉంది. దేశంలోని మొత్తం 300.1 కోట్ల డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో 294.5 కోట్లు అంటే 98.1 శాతం ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు వస్తాయి. అమౌంట్ పరంగా చూస్తే, మొత్తం రూ.83,89,470 కోట్ల డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంది.