అర్హులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

నల్గొండ అర్బన్, వెలుగు : అర్హులందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పేదలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబరు  ప్రభుత్వం 711, 717, 718లో ఉన్న 16 ఎకరాల భూమిని 2003లో కొనుగోలు చేసి 425 ప్లాట్లు చేసిందని గుర్తుచేశారు.  ఇందులో 12 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి.. మిగతా వారికి పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఇటీవల గ్రామ సర్పంచ్ తయారు చేసిన లిస్టులో అనర్హులు ఉన్నారని, అధికారులు ఎంక్వైరీ చేసి అర్హులకే పట్టాలు ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భాస్కర్ గౌడ్, శ్రీను, లింగస్వామి, రవీందర్, సతీశ్, మహమూద్, లింగస్వామి, రజిత, వెంకన్న, పెంటయ్య, కవిత, బిక్షం, నాగ శంకర్, తదితరులున్నారు.