
ఫలానా వ్యక్తి ఫలానా కులం. ఫలానా మతం అని వ్యక్తిగత వివరాల నిర్ధారణ ఆధారంగా సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస్తారు. కానీ, ఏ కులానికీ, మతానికి చెందిన వారు కాదనే సర్టిఫికెట్ కూడా ఇవ్పొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తికి కులం.. మతం లేదని నిర్ధారించే హక్కు ఎమ్మార్వోకు ఉంటుంది. అసలు ఇలాంటి సర్టిఫికెట్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు కూడా. భారత రాజ్యాంగంలోని 35-28 ఆర్టికల్స్ ప్రతీ పౌరుడికి మత స్వాతంత్ర్యపు హక్కును అందిస్తాయి.
ఈ ఆర్టికల్స్ ప్రకారం ఈ ఏ మతమూ లేదని చెప్పే హక్కు కూడా ఉంటుంది. అదే విధంగా ఆర్టికల్ -21 స్వేచ్ఛా హక్కును కల్పిస్తోంది. ఈ క్రమంలో కులం, మతం లేకుండా కూడా ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చు. ఒకవేళ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తే న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ పాయింట్ మీదే తమిళనాడుకు చెందిన స్నేహ తొమ్మిదేళ్లు పోరాడింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కులం, మతం లేదనే సర్టిఫికెట్ ఇచ్చింది.
వాస్తవానికి.. ఇలాంటి సర్టిఫికెట్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. 35 ఏళ్ల స్నేహ స్వతహాగా లాయర్. అందువల్ల ఈమెకు ఈ సర్టిఫికెట్ల విషయాలన్నీ బాగా తెలుసు. ఆమె తల్లిదండ్రులు కూడా లాయర్లే. అందువల్ల స్నేహను కులమతాలకు దూరంగా పెంచారు. రాజ్యాంగం ప్రకారం స్కూళ్లలో విద్యార్థుల కులమతాలను నమోదు చెయ్యకూడదు. కానీ చాలా స్కూళ్లలో నమోదు చేస్తున్నారు. కులం, మతం లేదనే సర్టిఫికెట్ స్నేహకు ఉన్నపళంగా రాలేదు. ఇందుకోసం ఆమె కుటుంబం 9 ఏళ్లపాటు పోరాడి సాధించింది.
వెలుగు, లైఫ్