అర్హులందరికీ కేంద్ర పథకాలు చేరాలి : అశ్విని శ్రీవాత్సవ్

డిచ్​పల్లి, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్​సంకల్ప్​యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సెంట్రల్ ​జాయింట్​సెక్రెటరీ, జిల్లా నోడల్ ​ఆఫీసర్​ అశ్విని శ్రీవాత్సవ్​ చెప్పారు.ఆదివారం మండలంలోని మెంట్రాజ్​పల్లి లో నిర్వహించిన వికసిత్ భారత్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీవాత్సవ్​ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో శానిటేషన్, ఆర్థిక సాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, విద్య, వైద్యం లాంటి అనేక స్కీములు ఉన్నాయని చెప్పారు. అడిషనల్​కలెక్టర్ ​చిత్రా మిశ్రా, డీపీవో జయసుధ, ఎంపీపీ గద్దె భూమన్న, సర్పంచ్​గోపాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మోపాల్: మండలంలోని మోపాల్, కంజర్, కులాస్​పూర్​(టీ)​ తదితర ​గ్రామాల్లో ఆదివారం వికసిత్ ​భారత్ సంకల్ప్​యాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాల లబ్ధిపొందిన వారితో మాట్లాడించి, వారి అనుభవాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వికసిత్ ​భారత్​క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఎంపీడీవో లింగం, ఎంపీవో ఎక్బాల్, సర్పంచులు రవి, భరత్, శ్రవణ్​ పాల్గొన్నారు.