హైదరాబాద్: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో సోమవారం (సెప్టెంబర్ 2) జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు సర్కులర్ జారీ చేశారు.
దీంతో సోమవారం జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ అన్నీ సెప్టెంబర్ 5న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఎల్లుండి జరగాల్సిన పరీక్షలన్నీ యథాతధంగా జరుగుతాయని రిజస్ట్రార్ చెప్పారు.
మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. డీఆర్ ఎఫ్, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను అలెర్ట్ చేసింది.
సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం, హెల్ఫ్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలో రెస్క్యూ టీం రాష్ట్రవ్యాప్తంగా మోహరించాయి.. మరోవై పు కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా 9 ఎన్డీఆర్ ఎఫ్ రెస్క్యూ టీంలను తెలంగాణకు పంపించిచింది.
ALSO READ | తెలంగాణలో సెప్టెంబర్ 2 న అన్ని విద్యా సంస్థలకు సెలవు