ఇయ్యాల లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

ఇయ్యాల లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం లోక్ సభలో 2024–25 ఓటాన్  అకౌంట్  బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఓటాన్  అకౌంట్  బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. లోక్ సభ ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్  అకౌంట్  బడ్జెట్ కు మార్పులు చేసి పూర్తి స్థాయి బడ్జెట్  ప్రవేశపెడతారు. ఇక గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ప్రభుత్వ వ్యయాలు, అంచనాలను ప్రకటించనున్నారు. అలాగే 2023–24 ఏడాది బడ్జెట్ లాగే ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ను కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్న విషయంపై చర్చ జరుగుతోంది.