
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఆలిండియా హార్టికల్చర్ మేళాను నిర్వహించనున్నట్లు మేళా ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గురువారం నుంచి ఫిబ్రవరి 3 వరకు 5 రోజుల పాటు 17వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఈ మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ప్రారంభిస్తారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను ఈ మేళాలో ప్రదర్శిస్తామన్నారు. మొత్తం 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మేళా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.