మిస్ ​వరల్డ్ పోటీలు రద్దు చేయాలి : ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం

మిస్ ​వరల్డ్ పోటీలు రద్దు చేయాలి : ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం
  • ఆ పోటీల వల్లఎవరికీ ఉపయోగం లేదు

ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్​లో నిర్వహించనున్న 72వ మిస్​వరల్డ్​ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆలిండియా డెమోక్రటిక్​ స్టూడెంట్​అండ్​యూత్​ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం  సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆ సంఘాల ప్రతినిధులు డాక్టర్ ​ఆలూరి విజయ లక్ష్మి, జి. కృష్ణ వేణి, శైలజ మాట్లాడారు. మహిళను విలాస వస్తువుగా దిగజార్చే అందాల పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 ఈ పోటీల వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. గెలిచిన వారు సినిమాల్లో చేరడం, వాణిజ్య సంస్థల ద్వారా డబ్బు సంపాదించుకోవడమే  చేస్తుంటారని ఆరోపించారు. ఈ సమావేశంలో రిటైర్డ్​ జస్టిస్ చంద్రకుమార్, గంగాధర్​ పాల్గొన్నారు.